Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

షూటింగ్ లో దుమ్ములేపుతున్న… “దుమారం”

శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం దుమారం. ఈ చిత్రానికి  జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్లిక్ హీరోగా తెరకెక్కుతున్న ఈ  సినిమాలో సుమన్ ఒక వినూత్నమైన పాత్రలో నటిస్తున్నారు. క్షురకుని వేషం లో నాయీబ్రాహ్మణుల గురించి యెంత చక్కగా వివరించారో… ఈచిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్డ్ షూటింగ్ కొమురవెల్లి లో  ఇటీవలే పూర్తీ చేసుకుంది.

ఈసందర్బంగా సుమన్ మాట్లాడుతూ… నాయీబ్రాహ్మణులను చాలావరకు చిన్నచూపు చూస్తున్నారని, కానీ ఆ కులమే లేకుంటే…? మన వేషధారణ ఎంతో  అందవిహీనంగా ఉంటుందని అన్నారు. సమాజంలో పేద, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరికి ఈ నాయిబ్రాహ్మణుల సేవలు ఎంతో అవసరం ఉంటుందని అన్నారు. దేశంలోని ప్రతిఒక్కరు రెగ్యులర్ గా సెలూన్ షాప్ కి వెళ్లి తన హేయిర్  స్టైల్ ని ఎంతో అందంగా కట్టింగ్ చేయించుకుంటారని, సమాజంలో నిజంగా బార్బర్ అనే వ్యక్తి లేకపోతే… తమ హేయిర్ స్టైల్ ని కటింగ్ చేసేవారు దొరకరని, అంతటి ప్రధాన్యం ఉన్న పాత్రలో నటించడం నిజంగా అది నాదృష్టం గా భావిస్తున్నానని సుమన్ తెలిపారు. మొదటగా దర్శకులు జి.ఎల్.బి  శ్రీనివాస్ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఈ క్యారెక్టర్ లో నటించేందుకు ఒప్పేసుకున్నానని అయన తెలిపారు.

చిత్ర దర్శకుడు జి.ఎల్.బి శ్రీనివాస్ మాట్లాడుతూ… సమాజంలో నాయీబ్రాహ్మణుల సేవలను సమాజానికి తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ కథను ఎంచుకున్నట్లు వివరించారు. వాస్తవాలకు నిలువుటద్దంలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అయన తెలిపారు. సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కిస్తున్న ఈ మూవీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈచిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్డ్ షూటింగ్ కొమురవెల్లి లో పూర్తీ చేసుకుందని, త్వరలో రెండవ షెడ్యూల్డ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు జి.ఎల్.బి తెలిపారు. అన్నమయ్య లో ఇవ్వని నంది అవార్డు ను మన క్షురకుని పాత్రతో సుమన్ గారికి నంది అవార్డు వస్తుందని నమ్మకం నాకు ఉందని దర్శకుడు జి.ఎల్.బి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఈచిత్రం గొప్ప విజయాన్ని అందుకోవాలని ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ యాజమాన్యం,సిబ్బంది కోరుకుంటున్నారు.

RSS
Follow by Email
Latest news