Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

త్వరలో ప్రేక్షకుల ముందుకు… మాతంగిగా మారిన ఒక స్త్రీ రియల్ స్టోరీ..

శ్రీకృష్ణార్జున మూవీ మేకర్స్ లో మొదటి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి దర్శక,నిర్మాతలు ఇద్దరు తొలిసారిగా ఈ మూవీ తో పరిచయం అవుతున్నారు.  నిర్మాతగా పెదారికట్ల చేనెబోయిన్ననరసమ్మ వెంకటేశ్వర్లు యాదవ్, దర్శకుడిగా సి వి ఎస్ ఎం వెంకట రవీందర్ నాథ్  ల కాంబినేషన్ లో తొలిచిత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, ఒక స్త్రీ రియల్ స్టోరీని తెరకెక్కించారు. గతంలో గ్రామాలలో మాతంగులుగా జీవిస్తున్న వాళ్లలో ఒక స్త్రీ నిజజీవిత ఆధారంగా ఒక కథను తీసుకొని దానికి కొంచెం హారర్ థ్రిల్లర్ జోడించి తెరకెక్కించారు. కేర్ ఆఫ్ దెయం అనే పేరుతో రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.

ప్రముఖ సైకో విలన్ పాత్రధారి సత్య ప్రకాష్ గుప్తనిధులు తీసే తాంత్రికుడు పాత్రలో నటించారు. గత షెడ్యూల్ లో ప్రముఖ డైరెక్టర్, నటుడు రవిబాబు ఒక మాంత్రికుడు పాత్రలో నటించగా, ప్రముఖ కమెడియన్ చిత్రం సీన్ స్మశాన కాపరిగా జబర్దస్త్ జూనియర్ పోసాని చిట్టిబాబు, ప్రేమ కథ చిత్రం ఫ్రేమ్ సైదులు, గబ్బర్ సింగ్ రాజశేఖర్  తదితరులు సత్య ప్రకాష్ కి శిష్యులుగా నటించారని డైరెక్టర్ సి వి ఎస్ ఎం రవీంద్రనాథ్  తెలిపారు.

నిర్మాత పెదారికట్ల చేన్నెబోయిన్న నరసమ్మ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఈ చిత్రం కన్నడ తెలుగు భాషల్లో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.  త్వరలోనే రిలీజ్ డేట్ కూడా వెల్లడిస్తామని అయన తెలిపారు. ఈ చిత్రానికి డిఓపిగా పీకే స్టిల్ రాజ్ కమల్, మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ కావలి, ప్రొడక్షన్ కంట్రోలర్ గా పూజారి భాస్కర్ రాజు మరియు అన్నారపు అంజిరెడ్డి చేస్తున్నారని ప్రొడ్యూసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో హీరోయిన్ ఒక ముఖ్య క్యారెక్టర్ చేసిన రమ్య చేసిందని అయన తెలిపారు.

మాతంగి క్యారెక్టర్ చేసిన హీరోయిన్ రమ్య మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాళ్ల జీవిత కథని వింటుంటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మాతంగిగా మారకముందు దేవత అని చెప్పి, మారిన తర్వాత ఒక వేశ్య గా చూస్తారని డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు అదంతా అబద్ధం అనుకున్నాను. కానీ  ఆ తర్వాత నేను కూడా దాని గురించి తెలుసుకున్నాను. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది. నాతో పాటు చేసిన చిన్నపిల్లల కొంతమంది వాళ్ళు కూడా నిజంగానే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుందని హీరోయిన్ తెలిపారు.

RSS
Follow by Email
Latest news