ఇంద్ర కంపెనీ బ్యానర్ పై నిర్మించిన చిత్రం డేటింగ్. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుకున్నట్లు చిత్ర దర్శకుడు కన్నీ తెలిపారు. ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశామని దర్శకులు అన్నారు. యాక్షన్, కామెడీ, హార్రర్, సస్పెన్సు త్రిల్లర్ తో చిత్రాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించామని అయన తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే చాలా బాగుందన్నారు.
చిత్ర నిర్మాతలు కె. ఇంద్ర, కావలి శ్రీనివాస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు తెలిపారు. సంగీత దర్శకులు బొల్లా విజయ్ కుమార్, ఎస్.కె ఇమాన్ వలి సమర్పణలో అజయ్ రాజ్, రాజేష్, ప్రభు హీరోలుగా… స్వాతినాయుడు, సాక్షిశర్మ, సాక్షి ప్రియా, సోనీసింగ్ హిరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారని వివరించారు. తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి నాలుగవ వారంలో వరల్డ్ వైడ్ గా అన్ని OTT ప్లాట్ ఫామ్ లలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.