ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెంది, స్థానిక నటీనటులు,సాంకేతిక నిపుణులు అందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో “ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ F-228” ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షులు తోరం రాజా తెలిపారు.
అందులో భాగంగా సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 18 తేదీ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని అయన తెలిపారు. అలాగే 19 న అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నందు మధ్యాన్నం 2 గంటలకు ఆత్మీయ సమావేశాలు జరుగుతుందని రాజా వివరించారు.
స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ సమావేశంలో పాల్గోని మన రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చేందడానికి సూచనలు సలహాలు ఇవ్వాలని అయన కోరుతూన్నారు.