చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. అందులో భాగంగా మోటరోలా తన ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లను ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లలో ఆకర్షణీయమైన ప్రీమియం డిజైన్ కు తోడు, వీటిల్లో కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
మోటో ఎడ్జ్ 30 అల్ట్రా లో 200 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ప్రత్యేకతగా చెప్పుకోవాలి. అలాగే, 50 మెగా పిక్సల్, 12 మెగా పిక్సల్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 60 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 6.67 అంగుళాల ఫుల్ హెడ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ కర్వ్ డ్ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. క్వాల్ కామ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ 8 ప్లస్ జనరేషన్ 1ను ఇందులో ఏర్పాటు చేశారు.
ఇక ఎడ్జ్ 30 ఫ్యూజన్ లో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 6.55 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో రానుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ చిప్ సెట్ ఇందులో ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే ఎడ్జ్ 30 అల్ట్రా రూ.73వేలు, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఆరంభ ధర రూ.48,000గా ఉంటుందని సమాచారం.