ముకుంద మూవీస్ పతాకంపై సి.కల్పన నిర్మిస్తున్న వైవిధ్యభరిత మహిళా ప్రధాన చిత్రం “రామ్ మోహన్ కంచుకొమ్మల”. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో రామ్ మోహన్ కంచుకొమ్మల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ముఖ్యపాత్రధారి. దివ్యకీర్తి, గరిమాసింగ్, నైనిక, వరాలబాబు, సంతోష్, సతీష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు-ముఖ్యపాత్రధారి అయిన రామ్ మోహన్ కంచుకొమ్మల మాట్లాడుతూ… “అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో… వారిలో స్ఫూర్తి నింపేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగిల్ కట్ చెప్పకుండా “ఎ” సర్టికెట్ తో సెన్సార్ పూర్తయ్యింది. ఈనెల 16న సుమారు 100 థియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము” అన్నారు.
దేవీప్రియ, రిషిత, మైత్రి, మహేశ్వరి, ఆపిల్ బాబు, త్రిమూర్తులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: తులసీనాథ్-సాంబ-సింహా కొప్పర్టి, సంగీతం: రాజ్ కిరణ్-లలిత్ కిరణ్- రాము అద్దంకి, సినిమాటోగ్రఫీ: రమేష్, ఎడిటింగ్: శ్రీనివాసరావు చీరాల, సహనిర్మాతలు: కె.భేషజ-కె.వైష్ణవి సహస్ర, సమర్పణ: మాస్టర్ ముకుంద, నిర్మాత: శ్రీమతి సి.కల్పన, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్సకత్వం : రామ్ మోహన్ కంచుకొమ్మల.