పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం, వీడియోలను చూడ్డానికి ఈ రియల్ మీ ప్యాడ్ మినీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దానికి సంబందించిన అమ్మకాలను సోమవారం నుంచే ప్రారంభించింది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్ లైన్ స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు మొదలయ్యాయి. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇవి లభించనున్నాయి. మొదటి సారి విక్రయాల్లో కొనుగోలుదారులకు రూ.2,000 తగ్గింపును రియల్ మీ ఆఫర్ చేస్తోంది.
ఈ రియల్ మీ మినీ ప్యాడ్ గతం లో వచ్చిన రియల్ మీ ప్యాడ్ కంటే కొంచెం చిన్నదిగా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే పనితీరులో కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేసినట్లు రియల్ మీ సంస్థ ప్రకటించింది. వైఫై, ఎల్టీఈని సపోర్ట్ చేసే రకాలు ఇందులో ఉన్నాయని సంస్థ తెలిపింది. 8.7 అంగుళాల స్క్రీన్, హెచ్ డీ రిజల్యూషన్ తో ఉంటుంది. అలాగే యూనిసాక్ ప్రాసెసర్ వాడారు. బెజెల్స్ పల్చగా ఉంటాయి.
వైఫైపై పనిచేసే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ధర రూ.10,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. అదే ఎల్టీఈ (4జీని నెట్ వర్క్ సిమ్ తో పనిచేసే) వేరియంట్ 3జీబీ, 32జీబీ ధర రూ.12,999. 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.14,999. బ్లూ, గ్రే రంగుల్లో లభిస్తాయని తెలిపింది. ఇందులో 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. 16 గంటల పాటు వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.