Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.

మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, ఈ నగరానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కావలసిన ప్రణాళికలను రచించామని అన్నారు. అనంతరం అసెంబ్లీలో మెట్రో స్వాధీనంపై తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా ప్రభుత్వం హస్తగతం అయిన తర్వాత మెట్రో ఛార్జీలు, సేవలు మారుతాయా? లేదా అలాగే కొనసాగుతాయా? చూడాల్సి ఉంది.

RSS
Follow by Email
Latest news