ఇజ్రయేల్, అమెరికా, ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గ్యాస్, ఇంధనం కొరత ఏర్పడుతుందేమోనని దేశంలో ప్రజలు ఆందోళన చెందుతున్న క్రమంలో వినియోగదారులకు ఒక శుభ వార్త. గ్యాస్ మరియు చమురు లోడ్ తో విశాఖపట్నం తీరానికి భారీ నౌకలు చేరుకున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ నిల్వలతో కూడిన భారీ ఓడలు విశాఖ హార్బర్ ప్రాంతానికి చేరుకున్నాయి. వీటి రాకతో ఇంధన సరఫరాలో ఉన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. తీరానికి వచ్చిన ఈ భారీ నౌకలు ఇంధన అవసరాలను తీర్చనున్నాయి.











