వెలిమినేడు అసైన్డ్ భూములను తెరాస ప్రభుత్వం కొల్లగొట్టొద్దని కోరుతూ… “అసైన్డ్ పేదల లాంగ్ మార్చ్ ని ఈరోజు నిర్వహించారు. లాంగ్ మర్చ్ కు పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అసైన్డ్ భూముల్లోకి ప్రభుత్వ అధికారులు అక్రమంగా జొరబడకుండా ఎకరానికో అసైన్దారుడి నిరంతర కాపలా ఉంటారన్నారు. “వెలిమినేడు అసైన్దారులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వమని ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ మొరపెట్టుకున్నారని వివరించారు. అయిన వాటిని ఖాతరు చేయకుండా, నియంతృత్వంగా, నోటిఫికేషన్లను జారీ చేసి, అధికార సిబ్బంది భూముల మీదికి వచ్చి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ వారి పప్పులేమి ఉడకనివ్వమని హెచ్చరించారు.
300 ఎకరాల చుట్టూరా 5 కిలోమీటర్ల వరకు పేదల దండుతో “లాంగ్ మార్చ్” నిర్వహించామని అన్నారు. అలాగే, నేటి నుండి ఎకరానికి ఒక్క మనిషి చొప్పున 300 మంది అసైన్దారులు 24 గంటలు కాపలా లేదా పహారా కాస్తారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం తమ భూముల మీదికి రానీయకుండా… చుట్టుప్రక్కల ప్రజలు వేల సంఖ్యలో అక్కడికి చేరుకొని తీవ్రంగా ప్రతిఘటిస్తారని వెంకట్ స్వామి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపోరాట కమిటీ అధ్యక్షుడు అంశాల సత్యనారాయణ, సభ్యులు అర్రూరి శివకుమార్, సామ రామిరెడ్డి, సిగిరెడ్డి అనంతరెడ్డి, సింగిరెడ్డి యాదగిరిరెడ్డి, సింగిరెడ్డి బాల్ రెడ్డి, గుఱ్ఱం వెంకటేశ్ ముదిరాజ్, మేడి స్వామి, మెట్టు శ్రీశైలం, మేడి రాములు, అంశాల హరినాధ్, అంశాల శ్రవణ్ కుమార్, మెట్టు రాములు, కొండాపురం స్వామి, మెట్టు సైదులు, చిరుమర్తి రవి, సోమనబోయిన కృష్ణ, దూడల యాదయ్య, మైల పిచ్చయ్య, పోతెపాక విజయ్, మేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.