Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’ రివ్యూ ..

విడుదల తేదీ : మార్చి 19, 2026

aptsbreakingnews.com rating : 2.5/5

నటీనటులు : పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, రావు రమేష్, కే ఎస్ రవికుమార్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు.
దర్శకుడు : హరీష్ శంకర్
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రాఫర్ : అయానకా బోస్
ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్

గ‌బ్బ‌ర్ సింగ్’ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా. అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ క‌లిసి ప‌ని చేయ‌డానికి దాదాపు 14 ఏళ్లు ప‌ట్టింది. ఇన్నేళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఎలావుందీ. ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’ లో ప‌వ‌న్ ని ఎలా చూపించాడు? ఈ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం…

కథ :- 

ఇదోక సింపుల్ లైన్‌. గ‌బ్బ‌ర్ సింగ్ లానే ఓ పోలీస్ ఆఫీస‌ర్ చేసే పోరాటం.  కాక‌పోతే.. గ‌బ్బ‌ర్ సింగ్ లో క‌థ‌గా చెప్పుకోవ‌డానికి కాస్తో కూస్తో మేట‌ర్ దొరుకుతుంది. ఇక్క‌డ అదే లేదు. పేరు మోసిన తీవ్రవాది (అజ్మల్ రహీం), సీఎం కావాలని తాపత్రయం పడుతున్న విల‌న్ నల్ల నారప్ప (ఆర్ పార్తిబన్) కలిసి చేసిన ప్లానింగ్ ఏంటి? విల‌న్ ఆట క‌ట్టించడానికి హీరో చేసే ప్ర‌య‌త్నం. ఏసీపీ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’ గా ఎలా అయ్యాడు. ఒక గూడెంలో చిన్నయ్యగా  పిలవబడే అనాథని ఆ ఊరి మాస్టర్ చంద్రశేఖర్ రావు (కే ఎస్ రవికుమార్) దత్తత తీసుకొని చదివిస్తారు. ఆ పసివాడు (అనాథ) హీరో,  ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్). ఈ క్రమంలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) ల ప్రాముఖ్యత ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్ :-

ఫస్టాఫ్ లో రావు రమేష్ పై ట్విస్ట్, సెకండాఫ్ క్లైమాక్స్ లో కూడా డిజైన్ చేసుకున్న ట్విస్ట్ లు బాగున్నాయి. మెయిన్ గా సెకండాఫ్ మాత్రం ఫ్యాన్ అండ్ మాస్ ఆడియెన్స్ బాగా నచ్చుతుందనే చెప్పాలి. పవన్ పై వింటేజ్ సాంగ్స్ తో మూమెంట్స్ చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. పైగా హరీష్ శంకర్ డిజైన్ చేసిన పలు సందర్భానుసార సన్నివేశాలు వాటిలో పాత పాటలు మిక్సింగ్ వంటివి పర్వాలేదని  అనిపిస్తాయి. వీటిలో పవర్ స్టార్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ మరియు డైనమిక్ ప్రెజెన్స్ లు ఇంప్రెస్ చేస్తాయి. ప్రధానంగా ‘ఎత్త‌రా. ఎత్త‌రా’ పాట ప‌వ‌న్ ఫ్యాన్స్ కు హుషారును తెప్పించిందనే చెప్పాలి.

సెకండాఫ్‌లో శ్రీ‌లీల‌తో ల‌వ్ ట్రాక్ మొద‌ల‌వుతుంది. ‘తొలి ప్రేమ‌’లోని పాట‌ని రీమిక్స్ చేసి పూర్తిగా వాడేశారు. ఆ పాట‌లోని విజువ‌ల్స్ క‌ల‌ర్‌ఫుల్ గా ఉంటాయి. ‘నీ మ‌న‌సే..’తో ప‌వ‌న్ ఫ్యాన్స్ కు కొన్ని మ‌ధుర జ్ఞాప‌కాలు ఉన్నాయి. వాటిని హ‌రీష్ మ‌రోసారి గుర్తు చేశాడు. సెకండాఫ్‌లో ఫ్యాన్స్ ని ఖుషీ చేసే ఎలిమెంట్ ఇదే. ‘త‌ర‌లిరాద త‌నే వ‌సంతం’ అనే పాట‌ని మంచి ప్లేస్ మెంట్ లో వాడాడు. పవన్ ఫాన్స్ కు ఇది బాగానే నచ్చింది. ప‌వ‌న్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా కుదిరాయి. రెండు గంట‌ల పాటు ప‌వ‌న్ ని ఫ్యాన్స్ త‌నివి తీరా చూసుకోవొచ్చు. ఆయ‌న కొన్ని స్టెప్పులు కూడా వేశారు.

మైనస్ పాయింట్స్ :-

‘ప‌సివాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అయ్యాడు’ అనే ప‌వర్ ఫుల్ ట్యాగ్ లైన్‌తో గ‌బ్బ‌ర్ సింగ్ లో హీరో ని ప‌రిచయ‌డం చేశాడు హ‌రీష్‌. సీన్ లోని యాక్ష‌న్ కంటే.. ఆ ట్యాగ్ లైన్ కే ఫిదా అయిపోయారు ఫ్యాన్స్‌. ఇక్క‌డ కూడా అలాంటి మ్యాజిక్ ఏదో ట్రై చేశాడు కానీ కుద‌ర్లేదు. ఇందులో.. ప‌వన్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కి న‌చ్చేలా పోరాటాలు, పాట‌లు, హీరోయిజాలు, మేన‌రిజాలు జోడించాడు ద‌ర్శ‌కుడు. సేమ్ టూ సేమ్.. గ‌బ్బ‌ర్ సింగ్ ఫార్ములానే. కాక‌పోతే.. గ‌బ్బ‌ర్ సింగ్ లో క‌థ‌గా చెప్పుకోవ‌డానికి కాస్తో కూస్తో మేట‌ర్ దొరుకుతుంది. ఇక్క‌డ అదే లేదు. క‌నీసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా వినిపించ‌లేదు.

సాంకేతిక వర్గం :-

రాశీఖ‌న్నా పాత్ర‌ని స‌రిగా చూపించలేకపోయారు. శ్రీ‌లీల ఓకే అనిపిస్తుంది. ఆర్ పార్తిబన్ తన నటనతో మెప్పించాడు. రావు ర‌మేష్ ప‌రిధి త‌క్కువే. కె.ఎస్‌.ర‌వికుమార్‌, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. త‌మ‌న్ ఇచ్చిన నేప‌థ్య సంగీతంలోనూ మెరుపులేం లేవు. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ ఒకే.

తీర్పు :-

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసే తీరుని ఇంకా బాగా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది. బహుశా మళ్లీ గబ్బర్ సింగ్ లానే చూపించారు అనే కామెంట్స్ వస్తాయని దర్శకుడు అనుకోని ఉండొచ్చు కానీ తన మెదడుకి మరింత పదును పెట్టి పవన్ ని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ఉగాదికి వచ్చిన “ఉస్తాద్ భగత్ సింగ్” ఫ్యాన్స్ కి పండగను తెచ్చినట్లుంది.

aptsbreakingnews.com Rating: 2.5/5

Reviewed by Banna Prabhakar 

RSS
Follow by Email
Latest news