Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ మెగాటోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్లుగా అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కంచుకోవాలని టీమిండియా భావిస్తోంది.  ప్రపంచకప్ టోర్నీ కోసం భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీమ్ ఇండియా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని విడుదల చేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్.  ఐసిసికి యువరాజ్ సింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో టి 20 ప్రపంచ కప్ కోసం 11 మంది భారత జట్టు ఎలా ఉంటుందో చెప్పాడు. ఇందులో హార్దిక్ పాండ్యా కు స్థానం కల్పించిన యువీ.. ‘ఐపీఎల్‌లో హార్దిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ టీ20 ప్రపంచకప్‌లో అతను రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది. అతని బౌలింగ్ సామర్థ్యం ఫిట్‌నెస్ రెండూ ముఖ్యమైనవి’ అని అన్నాడు. ఇంక యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయాలని యువరాజ్ చెప్పాడు.

ఇక విరాట్ కోహ్లీ మూడో స్థానంలో రావాలి. సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో నంబర్‌లో పంపవచ్చు. నేను రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ లో వెళతాను. ఇది ప్రత్యర్థి బౌలింగ్‌ను కష్టతరం చేస్తుందని యువరాజ్ సింగ్ అన్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గా సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్ అనే ప్రశ్నకు కూడా అతను సమాధానం ఇచ్చాడు.  సంజు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ రిషబ్ పంత్ ఎడమ చేతి వాటం. నా అభిప్రాయం ప్రకారం, రిషబ్‌కు భారత్‌కు మ్యాచ్ గెలిచే సత్తా ఎక్కువ. గతంలోనూ చేశాడు. అలాంటి ఆటగాడే పెద్ద స్థాయిలో మ్యాచ్ విన్నర్ అవుతాడు’ అని యువరాజ్ సింగ్ అన్నాడు.

RSS
Follow by Email
Latest news
కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి..