Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వరద బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే సీతక్క

👉 రామన్న గూడెం పుష్కర ఘాట్,ఏటూరు నాగారం వాడ గూడెం కర కట్ట వద్ద గోదావరి వరుద ఉద్రితీ ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
👉 కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలి
👉 జిల్లా అధికారులు అప్రమత్తం గా ఉండాలి

ఈ రోజు ఏటూరు నాగారం మండల కేంద్రంలో వాడ గూడెం కరకట్ట పరిసర ప్రాంతాలలో రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరుద ఉద్రితిని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…కరకట్ట నిర్మాణ కోసం 137 కోట్లు మంజూరు అయినప్పటికీ టెండర్ జరిగిన ఇప్పటికీ పనులు చేపట్టక పోవడంతో ఏటూరు నాగారం మంగపేట మండలాల ప్రజలు ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారని అన్నారు. ఏటూరు నాగారం రామన్న గూడెం మధ్య మాదిగ ఓర్రే తెగే పరిస్థితి ఉందని, ఈవిషయమై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళమని తెలిపారు. అధికారులు గ్రామాలలోని ప్రజాప్రతినిధులతో సమన్వయంతో చెరువులు, వాగుల, మరియు ప్రాజెక్టుల నీటి నిలువల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

ములుగు నియోజక వర్గం లో భారీ వర్షాలు ఉన్నందున గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని అన్నారు.

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని, రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు తలైతే అవకాశం ఉందని, కావున విధ్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.

RSS
Follow by Email
Latest news