2029లోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న అయన మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలు 2028 డిసెంబర్ నెలలో రావాల్సి ఉంటుందని.. అయితే ఈసారి మరో నాలుగు, ఐదు నెలలు వాయిదా పడి.. 2029లో వస్తాయని అయన అన్నారు. 2029 దేశ వ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారు.
ఈ క్రమంలోనే 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడి.. 2029లో కేంద్రంతోపాటు నిర్వహించే అవకాశం ఉందని సీఎం అన్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా జమిలీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు.











