‘దసరా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘శబర’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ సినిమా ఇంటెన్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని ఈ టిజాజ్ ని చూస్తే అర్థమవుతోంది. టీజర్ ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్, త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది. ప్రధానంగా ఈ సినిమా మొత్తం ‘బంగారు నిధి వేట’ చుట్టూ తిరిగే కథాంశంతో సాగనుంది. దీక్షిత్ శెట్టి మునుపెన్నడూ లేని విధంగా చాలా రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.
నటీనటులు : దీక్షిత్ శెట్టి సరసన మిషా నారంగ్ కథానాయికగా నటిస్తోంది.
సాంకేతిక నిపుణులు : కిలారు ప్రేమ్ చంద్ దర్శకత్వం వహిస్తుండగా, మిథున్ ముకుందన్ అందించిన సంగీతం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. టీజర్‌లోని విజువల్స్ సినిమా మేకింగ్ విలువలు ఎరేంజ్ లో ఉండబోతున్నాయో అర్ధం అవుతుంది .











