వైజాగ్ ఎకనమిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన మొదటి సమీక్షా సమావేశం జరిగింది . ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వైజాగ్ ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 9 జిల్లాల్లో చేపట్టే 49 ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ ప్రణాళికపై ఈ సందర్భంగా చర్చించారు. విశాఖ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను లోకేష్ కు సంబంధిత అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో ఐటీ, ఐటీ సేవల వాటా 10 శాతంగా ఉండాలని అన్నారు . విశాఖలో 10 గిగావాట్ల మేర డేటా సెంటర్ల ఏర్పాటుకు మూమెంటం వచ్చిందని తెలిపారు. జీసీసీలు, ఐటీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.











