Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మట్టి పాత్రలు ఉపయోగించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : మంత్రి పొన్నం

మట్టి పాత్రలు ఉపయోగించి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని ”మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కుల వృత్తులను ప్రోత్సహించండి” నినాదంతో అసెంబ్లీ ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉగాది కిట్ అందజేశారు.

పండుగకు అవసరమైన మట్టి కుండా, గ్లాస్ లు, జగ్గు, బౌల్, షడ్రుచులు ఉండే మామిడి కాయలు, వేప పువ్వు, బెల్లం, చింతపండు, కారం వస్తువులు ఆ కిట్ లో ఉన్నాయి. ప్రకృతిని కాపాడటానికి, అలాగే పర్యావరణాన్ని రక్షించడానికి ప్రజలందరూ తమవంతు సహాయ సహకారం అందించాలని పొన్నం కోరారు. సందర్భంగా వారు రాష్ట్ర ప్రజల కు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాం క్షలు తెలియజేశారు.

RSS
Follow by Email
Latest news