Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సినీ నటుడు అజిత్‌కు మహీంద్రా బీఈ6 ఫార్ములా కారు గిఫ్ట్

ప్రముఖ సినీ నటుడు అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్‌యూవీని చెన్నైలో బహూకరించింది. ఆయనకు ఈ కారును మహేంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ ఆర్.వేలుసామి అందించారు. అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అనే విషయం తెలిసిందే. ఆయనకు రేసింగ్ పట్ల ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ ఈ కారును అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఇటీవల ఆయన ఎక్కువగా దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఇటీవలే అయన దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చారు. ఆశ్రమంలో ఆయనకు ఈ కారును మహేంద్రా సంస్థ ప్రతినిధులు అందించి ఆయనను ఘనంగా సత్కరించారు.

RSS
Follow by Email
Latest news