Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మానవత్వం చాటుకున్న ఇనుగాల…

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. ఓ చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉండగా ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ సర్జరీ చేయించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు ట్రస్ట్ అధినేత ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.

వివరాల్లోకి వెళితే . ..: పరకాల పట్టణానికి చెందిన బొచ్చు శరత్-చైతన్య దంపతుల 6 నెలల కుమార్తె ఋత్వికకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో, అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. చికిత్సకు అవసరమైన భారీ ఖర్చు భరించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షులు, కుడా (KUDA) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారిని కలిసి తమ ఆవేదనను వివరించారు.

అయన తక్షణమే స్పందించి అపోలో హాస్పిటల్స్ మరియు ‘అపోలో ఫౌండేషన్ హృదాన్ (HRIDAAN) ప్రోగ్రామ్’ ద్వారా ‘ ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్‌లో చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. తమ బిడ్డకు పునర్జన్మను ప్రసాదించినందుకు ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్‌కు, ట్రస్ట్ అధినేత కు ఎంతో రుణపడి ఉంటామని ఆ చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

RSS
Follow by Email
Latest news