Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై రెచ్చిపోయిన భారత అభిమానులు

ది హండ్రెడ్ వేలం పాటలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు కోట్లు) స‌చేసింది. ఆతరువాత కొన్ని గంటలకే సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఎక్స్ ఖాతా స‌స్పెన్ష‌న్‌కు గురైంది. ఈ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ.2.34 న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఈ పోటీలో భారత్‌కు చెందిన‌ ఫ్రాంచైజీలో చోటు దక్కించుకున్న తొలి పాకిస్థాన్ క్రికెటర్‌గా అబ్రార్ అహ్మద్‌ రికార్డ్ నెలకొలిపాడు.

భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కు చెందిన ఫ్రాంచైజీ ఒక పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై కొంద‌రు భారత అభిమానులకు నచ్చలేదు. దింతో భారత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును బహిష్కరించాలనే డిమాండ్ చేశారు.

ఈ వార్త కాస్తా… ఎక్స్ వేదికగా వైరల్ అయింది. అలాగే ఫ్రాంచైజీతోపాటు సహ యజమాని కావ్య మారన్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఎక్స్ సంస్థ స‌న్ రైజ‌ర్స్ లీడ్స్ ఖాతా సస్పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. కానీ ఆ ఖాతాను తెరవడానికి ప్రయత్నించిన వినియోగదారులకు Account suspended. X suspends accounts that violate the X rules అనే సందేశం కనిపించింది.

RSS
Follow by Email
Latest news