Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హనుమకొండ దారుణం… ఇద్దరు సజీవదహనం

హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘోర ఘటన వెలుగుచూసింది. ఓ తండ్రి, కూతురు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మృతులు రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24)గా పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే… కుటుంబ కలహాల నేపథ్యంలో రాజశ్రీ భర్త ప్రవీణే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజశ్రీకి ప్రవీణ్‌తో 2023లో వివాహం జరిగింది.  వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రవీణే తన  భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

RSS
Follow by Email
Latest news