ఇటీవల విడుదల చేసిన ‘ధురంధర్2’ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్2’ ది రివెంజ్’. సారా అర్జున్ కథానాయిక. మాధవన్, సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగానే అంటే మార్చి 18న సాయంత్రం నుంచే ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే రికార్డులు తిరగరాస్తున్న ‘ధురంధర్2’. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.











