పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలవేళా బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఆరునెలల్లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని అయన అన్నారు. బెంగాల్ బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తామని, రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామని పేర్కొన్నారు.
ప్రధానంగా రాష్ట్రంలో అక్రమ చొరబాట్లపై ఉక్కుపాదం మోపుతామని అమిత్ షా హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి మహిళకూ నెలకు రూ.3వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. యువతకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు, వీరికి ఉద్యోగ వచ్చేవరకు ఇస్తామని ప్రకటించారు. రాబోయే అయిదేళ్లలో కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. ఈఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.











