రేపటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను ఖరారు చేయనుంది. ఇవే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈ బడ్జెట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఇక ఈనెల 18న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శనివారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 2 లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ కీలక అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల పాలనలో మూడు రాజధానులు.. సంక్షేమం.. విశాఖ గ్లోబల్ సమిట్ వంటి ముఖ్యమైన జగన్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.











