వరుస విజయాలతో దూసుకెలుతున్న రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ (78; 26 బంతుల్లో 8×4, 7×6) సుడిగాలి ఇన్నింగ్స్ కి ధ్రువ్ జురెల్ (81 నాటౌట్ 43 బంతుల్లో 8×4, 3×6) తోడవడంతో 202 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ సునాయాసంగా ఛేదించింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 201 పరుగులు చెసింది. ఒకానొక దశలో 11 ఓవర్లలో 94 పరులకే 6 ప్రధాన వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది. ప్రతికూల పరిస్థితుల్లో ఆజట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ అద్భుత పోరాటంతో జట్టును 200 వందల మార్క్ ను దాటించాడు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ బాట్స్ మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టేయడంతో ఆర్సీబీ 94/6తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆ స్థితిలో ఆ జట్టు 150 పరుగులు అయినా చేస్తుందా అనిపించింది. కానీ కెప్టెన్ పాటీదార్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తూ జట్టును 200 పైచిలుకు స్కోరు సాధించేలా చేశాడు. 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.
స్కోర్ :
బెంగళూరు ఇన్నింగ్స్ : సాల్ట్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 0; కోహ్లి (బి) బిష్ణోయ్ 32; పడిక్కల్ (సి) హెట్‌మయర్ (బి) ఆర్చర్ 14; పాటీదార్ (సి) ఫెరీరా (బి) సందీప్ 63; కృనాల్ (సి) హెట్‌మయర్ (బి) బిష్ణోయ్ 1; జితేశ్ ఎల్బీ (బి) బ్రిజేశ్ 5; డేవిడ్ (సి) హెట్‌మయర్ (బి) బ్రిజేశ్ 13; షెఫర్డ్ (సి) బ్రిజేశ్ (బి) జడేజా 22; వెంకటేశ్ నాటౌట్ 29; భువనేశ్వర్ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201;
వికెట్ల పతనం: 1-0, 2-45, 3-58, 4-62, 5-76, 6-94, 7-125, 8-166;
బౌలింగ్: ఆర్చర్ 3-0-33-2; బిష్ణోయ్ 4-0-32-2; బ్రిజేశ్ 4-0-37-2; బర్గర్ 3-0-32-0; సందీప్ 4-0-47-1; జడేజా 2-0-14-1.
రాజస్థాన్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) జితేశ్ (బి) హేజిల్‌వుడ్ 13; వైభవ్ (సి) కోహ్లి (బి) కృనాల్ 78; ధ్రువ్ జురెల్ 81 నాటౌట్; హెట్‌మయర్ (సి) హేజిల్‌వుడ్ (బి) కృనాల్ 0; పరాగ్ (సి) కృనాల్ (బి) హేజిల్‌వుడ్ 3; జడేజా 24 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం : (18 ఓవర్లలో 4 వికెట్లకు) 202;
వికెట్ల పతనం : 1-21, 2-129, 3-129, 4-134;
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-37-0; హేజిల్‌వుడ్ 4-0-44-2; కృనాల్ పాండ్య 4-0-30-2; అభినందన్ 3-0-54-0; డేవిడ్ 1-0-18-0; రొమారియో షెఫర్డ్ 2-0-18-0











