పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత రెండు వారాలుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరామ్ మధ్య యుద్ధం జరుగుతోంది. తాజాగా మరో పిడుగులాంటి వార్త ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. తాజా పరిణామాలు చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్దానికి దారితీస్తున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా ఉత్తర కొరియా కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. జపాన్ వైపు సముద్రంలో 10 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది.
ఈ విషయాన్ని దక్షిణ కొరియా ధ్రువీకరించింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపం నుంచి ఈ క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొంది. అయితే అమెరికాతో కలిసి దక్షిణకొరియా చేపట్టిన సంయుక్త విన్యాసాలకు ప్రతిగా క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. నిఘాను పెంచినట్లు, ఈ విషయాన్ని అమెరికా, జపాన్‌తో పంచుకున్నట్లు దక్షిణకొరియా వెల్లడించింది.











