విలక్షణ నటుడు, లెజెండరీ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నపాన్-ఇండియా భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి ఓ ప్రత్యేక వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నట్లు ప్రకటించింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈసందర్బంగా విడుదల చేసిన ఆ వీడియోలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఈ తరం వారికి అసలు సిసలు మోహన్ బాబు అంటే తెలియదు. ‘ప్యారడైజ్’ సినిమాతో మోహన్ బాబు అంటే ఏంటో చూపిస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.











