Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పాత రికార్డులను తిరగరాయనున్న ‘ఉస్తాద్..

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు హరీశ్ శంకర్ కావడం ఇక్కడ మరో విశేషం. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, టైటిల్ దగ్గర నుంచే అంచనాలను హైప్ చేసింది. ఇక పవన్ కల్యాణ్ కి ఉన్న మాస్ ఇమేజ్ కీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోయే కంటెంట్ అనేది అభిమానులకు అర్థమైంది. హరీశ్ శంకర్ కి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. పవన్ సినిమా నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారనేది ఆయనకి తెలుసునని అనడానికి ‘గబ్బర్ సింగ్’ సినిమాను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.

పవన్ కల్యాణ్ జోడీగా శ్రీలీల తొలిసారిగా నటిస్తుంది. నటన పరంగా .. డాన్స్ పరంగా శ్రీలీల ఆరితేరిందనే చెప్పాలి.  అయితే ఆమెకి సరైన హిట్ లేక చాలా కాలమే అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇక రాశీ ఖన్నా కెరియర్ గ్రాఫ్ చాలా స్లో అయిన తరువాత ఆమెకి దక్కిన గొప్ప అవకాశం ఇది. హరీశ్ శంకర్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా కీలకం కానుంది. ‘ఉస్తాద్’ పాత రికార్డులు తిరగరాయడం ఖాయమనే అభిమానులు అంటున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తేనే, ఏ స్థాయిలో ఆడియన్స్ ఉత్సాహాన్ని చూపిస్తున్నారనేది ఇట్టే అర్థమైపోతుంది.

RSS
Follow by Email
Latest news