బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లుగా గురువారం రోజున నియమించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ ఇంచార్జ్ గా నియమితులైన కొప్పిరాల శైలశ్రీ మాట్లాడారు. మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పా రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాం చందర్ రావు, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ సూచనలతో నాకు చాలా పెద్ద బాధ్యతలు చెప్పారని, వారి నమ్మకాన్ని వమ్ము కాకుండా పార్టీ అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నర్సంపేట మున్సిపాలిటీ ఇంచార్జ్ శైలశ్రీ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారు స్మార్ట్ సిటీలు మరియు అమృత్ (AMRUT) పథకం కింద వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ పట్టణ మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆమె విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి పైసా నేరుగా పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆమె అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న నిధులను దారి మళ్లిస్తూ, పట్టణ ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ మరియు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీలకు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ మహిళ మోర్చా నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ తెలిపారు.











