Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

విశాఖలో కివీస్ విధ్వంసం…. భారత్ టార్గెట్ 216 …

విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. దీంతో టీమిండియా ముందు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టిమ్ సీఫర్ట్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌లో చతికిల పడింది. మిండియాకు తొలి ఓవ‌ర్ తొలిబంతికే ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. భీక‌ర‌ ఫామ్‌లో ఉన్నా కెప్టెన్ సూర్య‌కుమార్ కూడా 8 ప‌రుగుల‌కే ఔట్ కావ‌డంతో రెండు వికెట్ల నష్టానికి భార‌త్ 9 పరుగులే చేసింది .

ఈ జోడీ, మ్యాచ్‌లో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఓపెనర్ సీఫర్ట్ 62 పరుగులు చేయగా, మరో ఓపెనర్ కాన్వే 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ కీలక భాగస్వామ్యానికి తేరా పడిన తరువాత న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. భారత బౌలర్లు పుంజుకోవడంతో కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కానీ చివర్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ కేవలం 18 బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో కివీస్ స్కోరు 200 దాటింది. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌వి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.


RSS
Follow by Email
Latest news