Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభమైంది.. ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.. ఈ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి  ప్రసంగించనున్నారు.. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరించనున్నారు .

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో సీఎం విడివిడిగా సమావేశంకానున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా అయన కలుసుకుంటారు. ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు.

RSS
Follow by Email
Latest news