టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఏ అర్హత లేకున్నా ఐఏఎస్ అధికారి అని చెప్పుకుని, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుమలలో తిష్ట వేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుమలలో అన్ని శాఖలకు ఆయనే అధిపతిగా చెలాయించి, కోట్లల్లో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం సిఐడి అధికారులకు కంప్లైంట్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఈఓ ధర్మారెడ్డి లీవుపై వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కొత్త ఈఓ వచ్చాక అన్ని అప్పజెప్పి వెళ్లిపోవాలని అన్నారు. శ్రీవారి ఆభరణాలు, టీటీడీ నిధులు, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో అన్ని అప్పజెప్పి పోవాలని అన్నారు. అప్పటివరకు ధర్మారెడ్డిని వెళ్లనివ్వదని, అయన పాస్ పోర్ట్ సీజ్ చేయాలనీ కోరారు. అవసమైతే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.