ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాసిన ఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది. స్టార్ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం సాయంత్రం కలబురగి నుంచి రేణిగుంటకు రాత్రి 7.30 గంటలకు వచ్చి, తిరిగి కలబురగికు వెళ్లాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఈ విమానాన్ని రద్దు చేశారు. ఇది తెలియక సుమారు 30 మంది ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చారు. తమను గమ్యస్థానాలకు చేర్చాలని, అక్కడే నిరసన తెలిపారు. తాము ఏమి చేయలేమని సంస్థ సిబ్బంది చేతులెత్తేశారు. దింతో రాత్రంతా విమానాశ్రయంలోనే పడిగాపులు కాశారు. వీరిలో కొంతమందిని కొల్హాపుర్‌కు, మరికొందరిని హుబ్బళ్లికి మంగళవారం ఉదయం తరలించారు.