ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సుప్రీంకోర్టు లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈమె వేసిన పిటిషన్ పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈనెల 24కు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ పిటిషన్‌లో పేర్కొంది.
తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఈడీ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో ఇరు వర్గాల పిటిషన్లపై మార్చి 24 న సుప్రీంలో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు లాయర్ వాదనలు వినిపించనున్నారు.