Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో 109 పరుగులకే కుప్పకూలిన భారత్

ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో భారత్  బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది.  టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య భారత జట్టు ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు బిత్తరపోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్, లైయన్ దెబ్బకు కేవలం 33.2 ఓవర్లలోనే పది వికెట్లు సమర్పించుకుంది. 84/7తో లంచ్ కు వెళ్లిన భారత్.. విరామం నుంచి వచ్చిన ఏడున్నర ఓవర్లలోనే మరో మూడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. చివర్లో ఉమేశ్ రెండు సిక్సర్లు కొట్టడంతో భారత్ మూడంకెల స్కోరు వంద మార్కును దాటింది.

విరాట్ కోహ్లీ (22), శుభ్ మన్ గిల్ (21) టాప్ స్కోరర్లు,  కేఎస్ భరత్ (17), ఉమేశ్ యాదవ్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్),  కెప్టెన్ రోహిత్ (12) రెండంకెల స్కోరు దాటారు. పుజారా (1), రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్ (0), అశ్విన్ (3) నిరాశ పరిచారు. మాథ్యూ కునెమన్ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. లైయన్ మూడు వికెట్లు తీశాడు. టాడ్ మర్ఫీకి ఒక వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ప్రస్తుతం  2–0తో ఆధిక్యంలో ఉంది.

RSS
Follow by Email
Latest news