Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వెస్టిండీస్ గడ్డపై సిరీస్ సొంతం చేసుకున్న భారత్..!

స్వదేశీ గడ్డపై పులి, విదేశీ గడ్డపై పిల్లి అనే నానుడి నుండి టీమిండియా  జట్టు ఆ పేరును చెడిపేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ పిచ్ లపై అలవోకగా విజయాలను అందుకుంటుంది. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ జట్టుపై ఇంగ్లాండ్ గడ్డపై ఓడించింది. ఆతరువాత మూడు వన్డేల సిరీస్ లోభాగంగా  వెస్టిండీస్ వెళ్లి అక్కడ తన ప్రతాపం చూపించింది. వరుసగా రెండు వన్డేలను గెలుచుని, మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ ఓపెనర్ షాయ్ హోప్ ఈ మ్యాచ్‌ లో సెంచరీ చేసి, తన కెరీర్ లో ఆడిన వందో మ్యాచ్ ను  చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు సాధించాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు, మేయర్స్ 39, షమర్ బ్రూక్స్ 35, రోవ్‌మన్ పావెల్ 13, రొమారియో షెపర్డ్ 15 పరుగులు చేశాసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు మూడు వికెట్లు లభించాయి.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ తడబడింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (13) అవుటయ్యాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ (43)  స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ (9) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ క్రీజులో కుదురుకుని అర్ధ శతకాలతో రాణించారు. వీరు ఉన్నంత వరకు గెలుపుపై ఆశలు ఉన్నాయి.  కానీ,  అయ్యర్ 63, శాంసన్ 54 పరుగులు చేసి అవుట్ కావడం, 205 కే ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ పని అయిపోయిందని అనుకున్నారు.

ఆదుకుంటాడనుకున్న దీపక్ హుడా 33 పరుగులు మాత్రమే చేసి  పెవిలియన్ చేరడం, శార్దూల్ ఠాకూర్ (3), అవేశ్ ఖాన్ (10) కూడా క్రీజులోకి వచ్చినట్టు వచ్చి వెనుదిరగడంతో భారత్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అప్పటికే క్రీజులో పాతుకుపోయిన అక్షర్ పటేల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, ఐదు సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేసి ఒంటి చేతితో జట్టుకు విజయాన్ని సాదించి పెట్టాడు. అక్షర్‌కు వన్డేల్లో ఇదే తొలి అర్ధ సెంచరీ. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అక్షర్‌కు లభించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమైంది.

RSS
Follow by Email
Latest news