విడుదల తేదీ : మే 06, 2022
నటీనటులు : విశ్వక్సేన్,రుక్సర్,ధిల్లాన్,రితిక నాయక్,కేదార్,శంకర్,గోపరాజు,రమణ,టేశ్వరరావు,వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ తదితరులు…!
సంగీతం : జయ్ క్రిష్.
ఛాయాగ్రహణం : పవి కె.పవన్.
నిర్మాతలు : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్,సుధీర్ ఈదర.
కథ-స్క్రీన్ ప్లే-మాటలు : రవికిరణ్ కోలా.
దర్శకత్వం : విద్యాసాగర్ చింతా.
మన టాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”. గత చిత్రాలకు భిన్నంగా.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం…
స్టోరీ : అల్లం అర్జున్ కుమార్ (విశ్వక్సేన్) వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తన జీవితం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో అతనికి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. అనుకోకుండా… గోదావరి ప్రాంతానికి చెందిన మాధవి (రుక్సర్ ధిల్లాన్)తో పెళ్లి కుదురుతుంది. అంటే..తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయితో పెళ్లి సెటిల్ అవుతుంది. నిశ్చితార్థం కోసం అమ్మాయి ఇంటికి అర్జున్ కుటుంబం బంధుగణంతో ఒక బస్సులో వెళుతుంది. కానీ ఆతరువాత అక్కడ లాక్ డౌన్ ప్రకటిస్తారు. వారు తీసుకెళ్లిన బస్సు కూడా రిపేర్ కి వస్తుంది. ఆతరువాత ఏం జరుగుతుంది. వారిద్దరికీ పెళ్లవుతుందా…? పెళ్లి కొడుకు బంధువులతో సహా అక్కడే ఉంటారా…? ఇలాంటి విఆశయాలు తెలియాలనే..? సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : హీరో విశ్వక్సేన్ ఒక కొత్త కోణంలో తన యాక్షన్ తో ఆకట్టుకుంటాడు. సినిమా మొత్తం ఒక మంచి ఎంటర్టైమెంట్ చిత్రం. అహల్లాదకరంగా కథ సాగిపోతుంది. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ కూడా మంచి అందగతే, తన నటనతో అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇక వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ కడా ఎంతో హాస్యాన్ని పండించారు. వారి వారి పాత్రల్లో బాగా ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ : సినిమా ఆద్యంత ఒకే మూసలో వెళుతున్నలు కనిపిస్తుంది. కథలో కొత్తదనాన్ని దర్శకుడు చూపించలేకపోయారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు జరగబోయే కథను ముందుగానే గెస్ చేసేలా ఉంది.
సాంకేతిక వర్గం : సినిమాని కెమెరామెన్ చాల అందంగా తీసాడు. తక్కువ లొకేషన్లలో మంచి హై రిచ్ తెప్పించాడు. జయ్ క్రిష్ మంచి సంగీతం అందించాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాతలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా విలువలు పాటించారు. ఎడిటర్ కూడా పరవాలేదనింపించాడు.
తీర్పు : ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఆద్యంత బాగానే ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం. మొదటి సాగ భాగం సినిమా చాలా బాగుంది. కానీ రెండో సగభాగం కొంత నిమ్మదిగా కథ సాగిపోతుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది. ఓసారి చూడొచ్చు.
సినిమా రేటింగ్ : 2.5 / 5
REVIEWED BY : BANNA PRABHAKAR, CEO, APTS BREAKING NEWS.