Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మే నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు జాబితా ఇదే ..

మే నెలలో 8 రోజుల పాటు బ్యాంకులుకు సెలవు దినాలు ఉన్నాయి. ఈ నెలలో ఒక్క రంజాన్‌/ అక్షయ తృతీయ మినహా పెద్దగా పండగలు లేనప్పటికీ.. ఈ సారి ఐదు ఆదివారాలు వచ్చాయి. ఇక రంజాన్‌, వారాంతపు సెలవులు మినహాయిస్తే మే నెలలో కేవలం 22 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.

అయితే, ఆర్‌బీఐ విడుదల చేసిన సెలవుల జాబితాలో రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ జయంతి (మే 9), బుద్ధ పూర్ణిమ (మే 19) కూడా ఉన్నప్పటికీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రవీంద్రనాథ్‌ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో, బుద్ధపూర్ణిమ సందర్భంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరుచుకోవు.

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవుల జాబితా..

01 మే 2022: ఆదివారం

03 మే 2022: రంజాన్‌/ అక్షయ తృతీయ

08 మే 2022: ఆదివారం

14 మే 2022: రెండో శనివారం

15 మే 2022: ఆదివారం

22 మే 2022: ఆదివారం

28 మే 2022: నాలుగో శనివారం

29 మే 2022: ఆదివారం

RSS
Follow by Email
Latest news