Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఎన్ ఆర్ ఐ కోటా పేరుతో కోట్లు దండుకుంటున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు :డి వై ఎఫ్ ఐ

మేనేజ్ మెంట్ సీట్లను ఎన్ ఆర్ ఐ సీట్లుగా మార్చుకొని అమ్ముకొని కోట్ల వ్యాపారం చేసిన ప్రైవేట్ మెడికల్ పీజీ కాలేజ్ లపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని SFI, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) కమిటీల అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ లోని కోటి సెంటర్ లో ఉన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్  కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం రిజిస్ట్రార్ కు మెమో రాండం ఇచ్చామని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ.జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. విజయ్ కుమార్ , ఏస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నీట్ కౌన్సిలింగ్ లో మేనేజ్ మెంట్ సీట్లను మిగిలాయని చెప్పి ఎన్ ఆర్ ఐ కోటాలో ఇష్టారీతిన ఒక్కో సీటుకు 2 కోట్లకు పైగా అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నాయని వారు ఆరోపించారు. ఈ విషయంలో కాళోజీ యూనివర్సిటీ చోద్యం చూస్తుందని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణలో కేవలం 2290 సీట్లు మాత్రమే ఉంటే అందులో సగం మేనేజ్ మెంట్ కోటాలో నే ఉన్నాయి. అందులో కూడా అమ్ముకోవడానికి ఎన్ ఆర్ ఐ కోటా ఎట్లాగూ ఉంది. అయినా తీరని దాహంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దుర్మార్గమని వారన్నారు.

అలాగే మెడికల్ విద్యలో పి.జి.సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో… విద్యార్ధులను ప్రలోభపెట్టి కొంతమందిని, విద్యార్ధులకు తెలియకుండా కొంత మంది సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులచేత  అడ్మిషన్లు కోసం దరఖాస్తు చేయించి, తర్వాత వారు వారి రాష్ట్రంకు వెళ్ళారని చెప్పడం, ఆ తర్వాత ఎన్.ఆర్.ఐ. కోటాలో ఆ సీట్లను కోట్ల రూపాయాలకు అమ్ముకుంటూ… అక్రమ దందాకు పాల్పడుతున్నారని అన్నారు. అలాంటి ప్రైవేట్ కళాశాలలపై సమగ్రమైన విచారణ జరిపించాలని భాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. దోషులుగా తేలిన కళాశాలల యొక్క  వైద్య విద్య గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల ఈ చర్యల వల్లన రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర విద్యార్ధులకు వైద్య విద్య అందించేందు ఏర్పాటైన కళాశాలలు కేవలం ధనమే ధ్యేయంగా ఉన్నాయని ,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని, రాజకీయ నాయకులు నడుపుతున్న ఈ కళాశాలల దందాపై ప్రభుత్వం కఠినంగా వ్యవరించాలని డిమాండ్ చేశారు. లేదంటే డి.వై.ఎఫ్.ఐ.ఏస్ ఎఫ్ ఐ ల ఆధ్వర్యంలో కళాశాలల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరబాద్ DYFI నాయకులు జావేద్, ఏస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ రాథోడ్ , భావికాడి శంకర్ లు, హైదరబాద్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మేడ్చల్ అధ్యక్షుడు వెంకటేష్,

RSS
Follow by Email
Latest news