చిత్రం: బైకర్
విడుదల: 3 ఏప్రిల్ 2026 :
aptsbreakingnews.com : రేటింగ్: 2.50/5
నటీనటులు : శర్వానంద్, మాళవిక నాయర్, సాయి కుమార్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు,
సంగీతం : జిబ్రాన్
ఛాయాగ్రహణం: జె యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
కూర్పు: అనిల్ కుమార్ పి
కళ : ఎ పనీర్ సెల్వం
నిర్మాతలు : వంశీ-ప్రమోద్; సమర్పణ: విక్రమ్
బ్యానర్ : యువి క్రియేషన్స్
రచన, దర్శకత్వం : అభిలాష్ రెడ్డి
స్పోర్ట్స్ డ్రామాలు తెరకెక్కించడం అనుకొన్నంత ఈజీ కాదు. భారతీయ తొలి మోటోక్రాస్ (బైక్) రేసింగ్ సినిమాగా బైకర్ విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించింది. రేసర్‌గా యువ కథానాయకుడు శర్వానంద్, ఆయనకు తండ్రిగా సీనియర్ హీరో రాజశేఖర్ నటించడం ఈ సినిమాని మరింత ప్రత్యేకంగా మార్చింది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రంలో ఎమోషన్స్ ఏ మేరకు ఆకట్టుకుంటాయనేది అసలు ట్విస్ట్.
స్టోరీ :
సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్ (రాజశేఖర్) మాజీ మోటోక్రాస్ రేసర్. భారతదేశంలో మోటోక్రాస్ రేసింగ్ క్రీడకూ గుర్తింపు తీసుకు రావాలని తపన పడుతూఉంటాడు. అందుకే మోటోక్రాస్ రేసర్లని తీర్చిదిద్దే పనిలో ఉంటాడు. కొడుకు విక్కీ (శర్వానంద్)కు కూడా బైక్ రేసింగ్ అంటే ఇష్టం. అందుకే సునీల్ కోచ్ అవతారం కూడా ఎత్తుతాడు. తన కొడుకుని ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనుకొంటాడు. అందుకే కష్టపడి కాంట్రాక్ట్ పట్టుకొంటాడు. తండ్రి దగ్గరే శిక్షణ పొందిన విక్కీ మోటోక్రాస్ రేసర్‌గా రాటుదేలతాడు. అంతర్జాతీయ స్థాయి రేసింగ్‌లో పాల్గొంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య విక్కీ ప్రేమలో పడతాడు. దింతో ఆతను మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వస్తుంది.
విక్కీని ఛాంపియన్‌గా చూడాలనుకొన్న తండ్రి ఆశలకు ఈ ప్రేమే అడ్డుకట్ట వేస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిపోతుంది. విక్కీ జీవితంలోకి వచ్చిన అనన్య (మాళవిక నాయర్) ఎవరు? విక్కీ మళ్లీ ట్రాక్‌పైకి రావాలనుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఎలాంటివి? తండ్రీ తనయులు మళ్లీ కలిశారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ కథలో తండ్రీ కొడుకుల ఎమోషన్‌కి పెద్ద పీట వేశారు. బైక్ రేసింగ్ లో తన కొడుకుని ఛాంపియన్‌గా చూడాలని తండ్రి తపన పడుతుంటాడు. తండ్రి మీద పడిన మచ్చ చెరిపేసి తనని హీరోగా చూడాలని కొడుకు తపిస్తుంటాడు. సో.. లైన్ పరంగా చూసినా ఎమోషన్ స్ట్రాంగ్ గానే ఉంది. కొత్తతరహా ఆటని పరిచయం చేసి, దాన్ని టెక్నికల్ గా బలంగా తెరపైకి తీసుకురాగలిగారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ తెరకెక్కించని నేపథ్యంలో ఓ సినిమా తీయగలిగారు. ఆ విషయంలో చిత్రబృందం సక్సెస్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
ఏ దశలోనూ ఎమోషన్ ని వదలకుండా జాగ్రత్త పడాలి. ప్రేక్షకులు కోరుకొనే హైప్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. తెరపై అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నా, ఏదీ పరిపూర్ణంగా అనుభవించే అవకాశం ప్రేక్షకుడికి కలగదు. ఎమోషన్స్ మోతాదునూ ఇంకాస్త పెంచి ఉంటే సినిమా మరో స్థాయిలో నిలిచేది.
నటీనటులు : కథానాయకుడు శర్వానంద్ నటనే ఈ సినిమాకి ప్రధానబలం. బుల్లెట్ సునీల్ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ ఆకట్టుకున్నారు. కథానాయిక మాళవిక నాయర్ ప్రాధాన్యమున్న పాత్రలోకనిపించారు. అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, తులసి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
రేస్‌కి సంబంధించిన సీన్లు, వాటి కొరియోగ్రఫీ చాలా బాగుంది. జిబ్రాన్సం గీతం కూడా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాప్ మ్యూజిక్ కి తలపించే బీజియమ్స్ వాడారు. అది మంచి కిక్ ఇచ్చింది. ఎడిటింగ్ (యాక్షన్ దృశ్యాల్లో) చాలా షార్ప్ గా, నీట్ గా ఉంది.
తీర్పు : నిర్మాణ సమస్థ ఖర్చుకు కాంప్రమైజ్ కాకుండా… విలువలకు తగ్గట్టుగా తీశారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ తెరకెక్కించని ఓ సినిమా తీయగలిగారు. ఆ విషయంలో చిత్రబృందం సక్సెస్ అయ్యింది.
aptsbreakingnews.com : రేటింగ్: 2.50/5
ఈ సమీక్ష అనేది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే .











