తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు హడావిడి కొనసాగుతోంది. ఇంటర్ పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపటి నుంచి అనగా శనివారం (మార్చి 14) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16న పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ పరీక్షల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.27 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 517,727 మంది, కాగా 10,512 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారు. పెరీక్షల నిర్వహణం కోసం మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసినట్లు తెలిపినారు . .
కాగా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9.35 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించేంది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందుగానే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రంలోని సిబ్బంది, స్క్వాడ్ ఎవరూ కూడా సెల్ ఫోన్లను వినియోగించవద్దని, తనిఖీలకు వచ్చే అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు పరీక్షా హాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దని అధికారులు తెలిపారు.
టైం టేబుల్ ఇదే ..:
హాల్ టికెట్లు లేకాపోతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. హాల్ హాల్ టికెట్ లేని విద్యార్థులు 80989 58096 నంబర్‌కు వాట్సాప్ చేయడం ద్వారా కూడా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
ఈరోజు ఏ పరీక్షా …
మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 23న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 28న గణితం
ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రం
ఏప్రిల్ 7న జీవశాస్త్రం
ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్
ఏప్రిల్ 15న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
ఏప్రిల్ 16న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I I











