ఏపీలో జగన్ సర్కారు పై తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబును ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. వైకాపా ప్రభుత్వంపై యువత, మహిళల్లో తిరుగుబాటు మొదలైందని, నిన్నటి సభతో ఆ విషయం రూడీ అయిందన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా నేతలను అభినందించారు. మహానాడుకు స్థలం ఇచ్చిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు.
