Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నందమూరి తారకరత్న దశ దిన కర్మ…హాజరైన సినీ , రాజకీయ ప్రముఖులు

నందమూరి తారకరత్న దశ దిన కర్మ ఈరోజు ( మార్చి 2వ తేదీన) ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడారు. చివరికి ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయన మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి శ్రేణుల్లో విషాదం నెలకొంది. తారకరత్న పెద్ద కర్మ […]

తెదేపా విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి

◆ఐక్యమత్యంగా పని చేయాలి. ◆యువతే తెలుగుదేశం ఆయుధం. ◆ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలి. ◆మహానాడును విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఇసుకదర్శి క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. […]

చంద్రబాబు,నారాయణలపై మరో కేసు నమోదు..!

అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ను పేర్కొన్నారు. మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిన్ననే సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. […]

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది చాలా దుర్మార్గపు ఘటన. ఆస్పత్రికి తీసుకొచ్చి బంధిస్తారా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది. ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం ఏపీకే అవమానం. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. ప్రభుత్వానిది అహంకారమా? ఉన్మాదమా? సీఎం తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం’’ అని […]

పేదలకు మంచి చేయొద్దనేది వారి ఉద్దేశం : సీఎం జగన్

రాష్ట్రంలో మనం యుద్ధం చేస్తున్నాం… ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో ఏకంగా రూ.1,36,694 కోట్లను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో ఎక్కడా లంచాలకు తావు ఇవ్వలేదని, నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని అయన అన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా ఏ సంక్షేమ […]

వరి ధాన్యం కొనుగోలు పేరుతో కెసిఆర్ డ్రామాలడారు : జక్కలి ఐలయ్య యాదవ్

కెసిఆర్ ప్రభుత్వం గత వారం రోజులుగా గా ధర్నాలు రహదారుల దిగ్బంధం నిరసన పేరుతో డ్రామాలు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. వరి ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కెసిఆర్ ప్రకటించడంతో టిఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉంటుందని అలాంటప్పుడు కెసిఆర్ నిర్ణయం లో కొత్తగా ఏముంది అని యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను […]

Latest news