తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా తంభాల సునీత భాద్యతలు తీసుకున్నారు. ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి నుండి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సునీత మాట్లాడుతూ దేవదేవుని సన్నిధిలో, ప్రసిద్ధ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో బాధ్యతలు చేపట్టడం తన అదృష్టమన్నారు. ఇక్కడే చదువుకున్న తాను, ఈ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యల పరిష్కారానిక తన వంతు కృషి చేస్తూ, అధికారులకు, సిబ్బందికి సహాయ సహకారాలు అందించి తిరుపతి నగరాభివృద్ధికి పనిచేస్తానని ఆమె స్పష్టం చేసారు.
