డ్వాక్రా మహిళలకు సియం స్మార్ట్‌ఫోన్ లు :

1

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అమరావతిలో ప్రజావేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రాలను ఉద్దేశిస్తూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని కార్యక్రమాల్లో వారు పోషిస్తున్న పాత్ర కీలకమైందని ప్రశంసిస్తూ.. ప్రపంచ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే డ్వాక్రా సభ్యులకు స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ మహిళలోనూ నాయకత్వ సమర్థత ఉందని.. మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమని.. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. డ్వాక్రాలో 98 లక్షల మంది పేద మహిళలు సభ్యులుగా ఉన్నారని, 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయని తెలిపారు. మహిళా డ్రైవర్లు కూడా వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ విషయంలో డ్వాక్రా సభ్యులకు అండాగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అసలు వడ్డీనే లేకుండా రుణాలను ఇస్తున్నామని.. మహిళలు ఆర్థీకంగా అన్ని విధాల ఎదగడానికి సహకరిస్తామంటూ.. మాతృమూర్తిని గౌరవించాలనే ఉద్దేశంతోనే సామూహిక సీమంతాల కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు.

Share.

1 Comment

  1. Pingback: డ్వాక్రా మహిళలకు సియం స్మార్ట్‌ఫోన్ లు : | The News Feed

Leave A Reply