Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అంతర్జాతీయ స్థాయిలో… తెలుగు చలన చిత్ర పరిశ్రమ..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయిని అందుకుందని బాలీవుడ్ దర్శకులు-నటీమణులు తెలుగు ఇండస్ట్రీని కొనియాడారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దాసరి ఒక ఇంటి పెద్ద లాగా ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని అన్నారు. దాసరి జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా
సత్కారం జరిగింది.

దాసరి కల్చరల్ ఫౌండేషన్… అలాగే, తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుక హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు బయోపిక్ ను “దర్శకరత్న” పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు దాసరి కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడివాక రమేష్ నాయుడు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుభాషా బయోపిక్ “దర్శకరత్న” పోస్టర్ ను ఈ సందర్బంగా ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 16 భాషలకు చెందిన దర్శకులకు సన్మానం చేశారు. వచ్చే ఏడాది దాసరి జయంతిని మరింత  ఘనంగా నిర్వహించనున్నామని రమేష్ తెలిపారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ జితేంద్ర వంటి లెజెండ్స్ ను ఈసందర్భంగా సత్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు తరుణ్ భట్టాచార్య, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు బి.గోపాల్, వీరశంకర్, ముప్పలనేని శివ, ఆర్.నారాయణమూర్తి, చంద్రమహేష్, రాజా వన్నెంరెడ్డి, బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణమోహన్ రావు, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, మాదాల రవి, మోహన్ గౌడ్, బాబ్జి, “పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్, సీనియర్ జర్నలిస్టులు విజయ్ బాబు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత సి.శ్రీకాంత్ కుమార్-అంకిత బ్రహ్మ ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

RSS
Follow by Email
Latest news