Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమథంగా ఉండాలి… సీఎం కేసీఆర్

బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దింతో అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులు, వాతావరణశాఖ నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని అయన కోరారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం  ప్రకటించారు. ‘‘భారీ వర్షాలతో అకస్మాత్తు వరదలు వస్తే సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వైమానిక దళాన్ని సంప్రదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ తోపాటు వైమానిక దళ హెలికాప్టర్లు నాలుగు. మొత్తం ఐదు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతున్నట్లు కేసీఆర్ వివరించారు. అలంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు  ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంటుందని అన్నారు.

గోదావరిలో సమ్మక్క బ్యారేజీ దగ్గర 9 లక్షలకుపైగా క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నారు. కావున గోదావరి నది పరివాహక ప్రాంతాల అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను సిద్ధం చేశాం. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని విద్య సంస్థలకు 3 రోజులు అంటే సోమ, మంగళ, బుధవారం సెలవులు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ మూడు రోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయన కోరారు.

‘‘రోడ్లు, కల్వర్టులపై వరద ఉంటే బస్సులు నడపవద్దని ఆర్టీసీ ఆధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అయన తెలిపారు. వానలకు నాని ఇళ్లు కూలిపోతున్నాయి. అందువల్ల రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని వేల పాత ఇళ్లను కూలగొట్టించాం. మరికొన్ని చోట్ల కోర్టు స్టేలతో కూల్చివేతలు ఆగిపోయాయి. అలాంటి చోట ఇళ్లలో జనం ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు అందరు తమతమ నియోజక వర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని,  ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

గోదావరి ఉప్పొంగడం వల్ల తీరాన ఉన్న మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ముంపు నెలకొనే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సచివాలయం, పంచాయతీరాజ్‌, మున్సిపల్ శాఖలు, జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. అత్యవసరమైతే కాల్‌ సెంటర్లకు ఫోన్‌ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారని సీఎం తెలిపారు. వలస కార్మికులు శ్రీకాకుళం నుంచి నల్లగొండకు వచ్చిన ఇద్దరు కూలీలు మరణించారని, వారికీ చెరో రూ3 లక్షల చొప్పున పరిహారాన్ని ఇస్తామని సీఎం ప్రకటించారు.

RSS
Follow by Email
Latest news