నగరంలోని చార్‌బౌలిలో ప్రమాదం జరిగింది. పాతభవనం కూల్చివేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల నుంచి సాగర్, సునీత మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఇద్దరిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
