వేములవాడ నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇన్చార్జి ఎర్రం నరసయ్య పటేల్ ఆధ్వర్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు వైయస్సార్ తెలంగాణ పార్టీ లో చేరారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో పలువురు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చుక్కల రాము కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, పేద ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాకీర్ భాష కమలాకర్ హుస్సేన్ హైమద్ అర్జున్ అజీమ్ మహమ్మద్ ఉన్నారు.
