విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(NSS) ఆద్వర్యంలో మరియు శివాజీ యూత్ ఫౌండేషన్ వారి సహకారం తో విశ్వవిద్యాలయం లో మట్టి వినాయక విగ్రహాలను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి పంపిణి చేశారు . విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. పి రామచంద్రా రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి వినాయక విగ్రహాలను అందచేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డా. పి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ పండుగలు, సంప్రదాయాల పరిరక్షణ తో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది అని అన్నారు.
వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులు పక్కనపెట్టి, పర్యావరణ హిత గణపతి విగ్రహాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని అయన పిలుపు ఇచ్చారు. ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి ఆదేశాల మేరకు ఇటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాలనెన్నో విశ్వవిద్యాలయం ఆచరిస్తుంది అని తెలిపారు. ఈ మంచి కార్యక్రమాన్ని మనందరం అవలంబించి ఇతరులకు తెలియ చేయాలి అన్నారు. అందరూ మట్టితో చేసిన విగ్రహాన్ని వాడాలని తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను అలాగే వివిధ రకాల రంగులతో చేసిన విగ్రహాలను పూజకు ఉపయోగించే వాటర్ బాడీస్ లో నిమజ్జనం చేయడం వలన వాటర్ బాడీస్ కాలుష్యం అయ్యే అవకాశం ఉందని వివరించారు. శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మొరపు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ…ప్రజలందరూ మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన జాతీయ సేవా పథకం సమన్వయకర్త డా . ఉదయ్ శంకర్ అల్లం ను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డీన్ డా. సి ఎచ్ విజయ, డిప్యూటీ రిజిస్ట్రార్ డా. సి ఎచ్ సాయి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి సుజయ్, డా. వీరా రెడ్డి, డా. విజేత, డా. సాయినాథ్, డా. త్రివేణి , డా. శ్రీకన్య రావు , డా. సాయి స్రవంతి, డా. బి వి సుబ్బా రెడ్డి మరియు నోవా బ్లడ్ బ్యాంకు సభ్యులు బి వెంకట కిశోర్ గిరీష్ కుమార్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.